Friday, December 20, 2024

అరుణ్ రామచంద్ర పిళ్లైకి షాక్ ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లై బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు గురువారం కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్రపిళ్లైని ఈ ఏడాది మార్చి 6వ తేదీన ఇడి అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరుణ్ రామచంద్ర పిళ్లై స్టేట్ మెంట్ ను దర్యాప్తు సంస్థలు కోర్టుకు సమర్పించాయి. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కట్వకుంట్లకు కవితకు అరుణ్ రామచంద్రపిళ్లై బినామీ అని దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కోర్టులో దాఖలు చేసిన చార్జీషీట్లలో కూడ ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థలు ప్రస్తా వించాయి.

అయితే తొలుత తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని అరుణ్ రామచంద్రపిళ్లై వెనక్కి తీసుకున్నారు. ఈ విషయమై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై వాదనల సమయంలో ఈ విషయాన్ని అరుణ్ రామచంద్ర పిళ్లై తరపు న్యాయవాది ప్రస్తావించారు. స్టేట్ మెంట్ వెనక్కు తీసుకున్నందుకుగాను బెయిల్ ఇవ్వకుండా నిరాకరించవద్దని కూడ కోరాడు. ఈ నెల రెండో తేదీన ఇరువర్గాల వాదనలు కోర్టు విన్నది. గురువారం తీర్పును వెల్లడించనున్నట్టుగా తెలిపింది. గురువారం సాయంత్రం అరుణ్ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై కోర్టు తీర్పును వెల్లడించింది. బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

మాగుంట రాఘవకు బెయిల్ మంజూరుపై సుప్రీంలో సవాల్ చేసిన ఇడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శరత్ చంద్రారెడ్డి ఈ కేసులో అఫ్రూవర్ గా మారుతానని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో అరెస్టైన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు మాగుంట రాఘవకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు చేయడాన్ని ఇడి గురువారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లో సిబిఐ, ఇడి అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రెండు రాష్ట్రాలకు చెందిన పలువురిని సిబిఐ, ఇడి అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియాను సిబిఐ ఈ ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ చేసింది. ఈ కేసులో మనీష్ సిసోడియా తీహార్ జైలులోనే ఉన్నాడు. బెయిల్ కోసం మనీష్ సోసిడియా దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు ఇటీవలనే తిరస్కరించింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News