- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్నారు. కాగా ఆయన పెట్టుకున్న బెయిల్ వినతిని ఢిల్లీ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రత్యేక జడ్జీ ఎంకె. నాగ్‌పాల్ ఆయన వినతిని తోసిపుచ్చారు. ఢిల్లీ కోర్టు మార్చి 24న ఉత్తర్వును నిలిపి ఉంచింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అవినీతి జరిగిందంటూ సిసోడియాను ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అయితే ఆయన నేరం నిరూపించకుండానే కస్టడీని పదేపదే పొడగిస్తూ పోతోంది. ‘ఒక నిరాపరాధిని శిక్షించే కన్నా, వంద మంది అపరాధులను వదిలిపెట్టవచ్చు’ అన్నది కాగితాలకే పరిమితమేమో!
- Advertisement -