Wednesday, January 22, 2025

కేజ్రీవాల్, సిసోడియా, కవితల కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జుడిషియల్ కస్టడీని ఆగస్టు 13 వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది. బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కె కవిత కస్టడీని కూడా ప్రత్యేక న్యాయామూర్తి కావేరీ బవేజా ఆగస్టు 13 వరకు పొడిగిస్తూ బుధవారం ఆదేశాలు జారీచేశారు. ఇదే కుంభకోణానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసులో సిసోడియా, కవితల జుడిషియల్ కస్టడీని ఆగస్టు 9 వరకు కోర్టు పొడిగించింది. ఇదివరకు విధించిన జుడిషియల్ కస్టడీ గడువు ముగియడంతో నిందితులను బుధవారం కోర్టులో హాజరుపరిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News