Sunday, January 19, 2025

కేజ్రీవాల్, సిసోడియా, కవితల జ్యుడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ స్కామ్ తాలూకు మనీ లాండరింగ్, అవినీతి కేసులో ఢిల్లీ కోర్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  జ్యుడీషియల్ కస్టడీని గురువారం పొడగించింది. ఈడి దర్యాప్తు చేస్తున్న మనీలాండరింగ్ కేసులో జులై 31 వరకు, సిబిఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8 వరకు కేజ్రీవాల్ కస్టడీని ప్రత్యేక జడ్జీ కావేరి బవేజా పొడగించారు.

మనీ లాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీపార్టీ నాయకుడు, ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి  మనీశ్ సిసోడియా, బిఆర్ఎస్ నాయకురాలు కె. కవిత , ఇతర నిందితుల జ్యడీషియల్ కస్టడీని కూడా జడ్జీ జులై 31 వరకు పొడగించారు. నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెట్టారు.

సుప్రీం కోర్టు ఇదివరలో ఈడి కేసులో కేజ్రీవాల్ కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. అయినా ఆయన ఇప్పటికీ తీహార్ జైలులో ఉన్నారు. కారణం ఆయన కేసులో బెయిల్ బాండ్ సమర్పించలేదు. ఆయన సిబిఐ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News