Wednesday, January 22, 2025

మనీశ్ సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని పొడగించిన ఢిల్లీ కోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియా జ్యూడీషియల్ కస్టడీని మే 31 వరకు పొడగించింది. సిసోడియా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో 2023 ఫిబ్రవరి నుంచి జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన బాస్ అరవింద్ కేజ్రీవాల్ ని కూడా మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. కానీ ఆయన ప్రస్తుతం జూన్ 2 వరకు తాత్కాలి బెయిల్ పై బయట ఉన్నారు.

ఈడి, సిబిఐ దాఖలు చేసిన అవినీతి మనీ లాండరింగ్ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ వినతులపై ఢిల్లీ కోర్టు నేడు సాయంత్రం 5 గంటలకు తీర్పు వెలువరించనున్నది. మే 14న ఢిల్లీ కోర్టు తన తీర్పు ఉత్తర్వును రిజర్వులో పెట్టింది. కాగా ఈడి, సిబిఐ మనీశ్ సిసోడియాను బెయిల్ పై విడుదల చేయబోవడాన్న వ్యతిరేకిస్తున్నాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News