- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని రూస్ అవెన్యూ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. రూ. లక్ష పూచీకత్తు, రూ. 15 వేల బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి కేజ్రీవాల్ కోర్టుకు హాజరుకావడం ఇదే తొలిసారి. చివరి విచారణలో, అతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరయ్యారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో విచారణలో పాల్గొనాలని తమ సమన్లను ధిక్కరించినందుకు కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండు ఫిర్యాదులు దాఖలు చేసింది.
- Advertisement -