Wednesday, January 22, 2025

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు బెయిల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు గురువారం భారీ ఊరట దక్కింది. ఢిల్దీ మద్యం స్కామ్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో ఆయనకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దశలోనే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈ బెయిల్ ఆదేశాలను కనీసం 48 గంటల పాటు నిలిపివేయాలని, తాము ఎగువకోర్టుకు వెళ్లేందుకు వీలు కల్పించాలని వేడుకుంది. అయితే ఈ అభ్యర్థనను ప్రత్యేక న్యాయమూర్తి తోసిపుచ్చారు. కేజ్రీవాల్ రూ 1 లక్ష పూచీకత్తుతో విడుదలకు ఆదేశించిన కోర్టు కొన్ని షరతులు విధించింది. ఇప్పటికీ కేసు విచారణ జరుగుతున్నందున ఈ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధంగా కూడా ప్రభావితం చేయరాదని , ఈ కోణంలోనే రిలీఫ్ ప్రకటిస్తున్నామని పేర్కొంది, దర్యాప్తునకు పూర్తిగా సహకరించాల్సి ఉంటుంది.

అవసరం అయినప్పుడు , పిలిచినప్పుడు కోర్టు ఎదుటికి రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై గురువారం ఉదయం పలు గంటల పాటు కోర్టు తన రూలింగ్‌ను రిజర్వ్ చేసి ఉంచింది. వాదోపవాదాలను ఆలకించింది. ఓవైపు ఇడి తమ వాదనలో ఈ మొత్తం నేరానికి సంబంధించి కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని సహ నిందితుడు అని తెలిపింది. దీనిని కేజ్రీవాల్ లాయర్లు వ్యతిరేకించారు. ఆయనను బాధ్యులుగా చేసేందుకు సరైన ఆధారాలు ఏమీ లేవని పేర్కొన్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ఆప్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. సత్యమేవ జయతే అని పేర్కొంటూ రాష్ట్ర మంత్రి అతిషి సామాజిక మాధ్యమంలో స్పందించారు. సత్యాన్ని ముప్పుతిప్పలు పెట్టగలరేమో కానీ ఓడించలేరని ఆప్ పేర్కొంది. బిజెపికి చెందిన ఇడి అభ్యంతరాలను తోసిపుచ్చిన గౌరవనీయ న్యాయస్థానం తమ నేతకు బెయిల్ ఇచ్చిందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News