Wednesday, January 22, 2025

ఉద్యోగాలకు రైల్వే భూమి కేసు… మాజీ సిఎం రబ్రీదేవికి ఇద్దరు కుమార్తెలకు బెయిల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉద్యోగాలకు రైల్వే భూమి కేసులో మాజీ సిఎం రబ్రీదేవికి, ఆమె ఇద్దరు కుమార్తెలు మీసా భారతి, హేమ యాదవ్‌లకు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ , రబ్రీదేవి పెద్ద కుమార్తె మీసా భారతి బీహార్‌నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈడీ వీరి బెయిల్‌కు ఎలాంటి అభ్యంతరం తెల్పక పోవడంతో స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే వారు ముగ్గురికి బెయిల్ మంజూరు చేశారు.

కేసు తీవ్రత దృష్టా బెయిల్ మంజూరు చేసేటప్పుడు కఠినమైన షరతులు విధించాలని ఈడీ కోర్టుకు సూచించింది. ఈ ముగ్గురి రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులపై వాదనలకు సమయం అవసరమని ఈడీ పేర్కొనడంతో ఫిబ్రవరి 9న జడ్జి మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసి సమన్లు జారీ చేయడంతో నిందితులు కోర్టుకు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News