Monday, November 18, 2024

కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై సిబిఐకి నోటీసులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన అవినీతి కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని సిబిఐఐరి ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నోటీసు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణనను జులై 17వ తేదీకి జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ వాయిదా వేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపిస్తూ కేజ్రీవాల్ ఉగ్రవాది కాదని, ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని తెలిపారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) నమోదు చేసిన మనీ లాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత ఆయనను సిబిఐ అరెస్టు చేసిందని న్యాయవాది తెలిపారు. కాగా..దిగువ కోర్టులో బెయిల్ దరఖాస్తు దాఖలు చేయకుండా కేజ్రీవాల్ నేరుగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం పట్ల సిబిఐ తరఫు న్యాయవాది డిపి సింగ్ అభ్యంతరం తెలిపారు. లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News