Friday, November 22, 2024

తబ్లీగీ కేసులో 35మంది విదేశీయులకు పాస్‌పోర్టులివ్వాలని ఢిల్లీ కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

Delhi court ordered issuance of passports to 35 foreigners in Tablighi case

 

న్యూఢిల్లీ: తబ్లీగీ జమాతే కేసులో 35మంది విదేశీయులకు పాస్‌పోర్టులు ఇవ్వాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. వారిని గతేడాది డిసెంబర్‌లోనే ఈ కేసులో నిర్దోషులుగా తీర్పు ఇచ్చినందున పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. శనివారం దీనిపై విచారణ జరిపిన చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అరుణ్‌కుమార్‌గార్గ్ ఈ ఆదేశాలిచ్చారు. నిర్దోషులుగా విడుదలైన 14 దేశాలకు చెందిన విదేశీయులపై తిరిగి రివ్యూ పిటిషన్ కూడా పోలీసులు వేయనందున ఈ కేసు నుంచి వారు పూర్తిగా విముక్తులైనట్టేనని మెజిస్ట్రేట్ స్పష్టం చేశారు. వారిని వారి సొంత దేశాలకు వెళ్లేందుకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 13న కేంద్రానికి సూచించింది. గతేడాది మార్చి 12 నుంచి ఏప్రిల్ 1 వరకు ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మతపరమైన సమావేశాలకు కరోనా నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా హాజరైనట్టు వారిపై కేసు నమోదైంది. అయితే, వారు నిబంధనలు ఉల్లంఘించినట్టు పోలీసులు తగిన సాక్షాలను చూపించలేకపోయారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News