Thursday, January 23, 2025

ఉపహార్ సినిమాహాల్‌ని మళ్లీ తెరవాలని ఢిల్లీ కోర్టు ఉత్తర్వు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 1997లో భారీ అగ్ని ప్రమాదానికి గురై 59 మంది ప్రేక్షకులను బలిగొన్న ఉపహార్ సినిహా హాలు తొలగించి తిరిగి తెరవాలని ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశించింది. సీల్ చేసి ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ సినిమాహాలును యాజమాన్యానికి తిరిగి అప్పగించడానికి ఎలాంటి అభ్యంతరం తమకు లేదని సిబిఐ, ఢిల్లీ పోలీస్ అండ్ అసోసియేషన్ ఆఫ్ విక్టిమ్స్ ఆఫ్ ఉపహార్ ట్రాజెడీ (ఎవైయుటి) అధ్యక్షుడు నీలం క్రిష్ణమూర్తి, తమ నో అబ్జెక్షన్‌ను సుప్రీం కోర్టుకు దాఖలు చేయడాన్ని ఢిల్లీ కోర్టు ఉదహరించింది. సినిమా హాలును తిరిగి తమకు అప్పగించాలని అన్సాల్ థియేటర్స్ అండ్ క్లబ్ హోటల్స్ ప్రైవేట్ సంస్థ దరఖాస్తు చేసింది. ఈ సంస్థ మాజీ డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ దిగ్గజాలైన సుశీల్ అన్సాల్, గోపాల్ అన్సాల్, అగ్నిప్రమాదానికి సంబంధించి శిక్ష పొందారు. ఈ కేసు తుది విచారణకు రాగా , ఢిల్లీ కోర్టు పైవిధంగా స్పందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News