Tuesday, January 21, 2025

మగాళ్లకూ హక్కులుంటాయి

- Advertisement -
- Advertisement -

ఆడాళ్లతో సమానంగా మగవాళ్లకు కూడా హక్కులు ఉంటాయని , మహిళలు వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి పురుషులపై తప్పుడు కేసులు పెట్టరాదని ఢిల్లీ కోర్టు స్పష్టం చేసింది. ఓ వ్యక్తిపై ఓ మహిళ తప్పుడు రేప్ కేసుపెట్టినట్లు నిర్థారణ కావడంపై న్యాయస్థానం స్పందించింది. సదరు మహిళపై వెంటనే చట్టపరమైన చర్యకు దిగాలని స్థానిక పోలీసులకు ఆదేశాలు వెలువరించింది. మహిళకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్న మాట వాస్తవమే, అయితే వీటిని దుర్వినియోగం చేసుకోరాదని అదనపు సెషన్ జడ్జి షెఫాలీ బర్నాలా టాండన్ పేర్కొన్నారు.

రేప్ వంటి తప్పుడు కేసులు పెడితే వీటిని ఎదుర్కొనే వ్యక్తి పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మహిళ అర్థం చేసుకోవాలని న్యాయస్థానం ఆగ్రహించింది. తనపై తప్పుడు కేసు పెట్టారని, బెయిల్ కావాలని నిందితుడు కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదీ ఇష్టపూరితంగానే నిందితుడితో స్థానికంగా హోటల్‌కు వెళ్లడం, అంగీకారంతోనే కలిసి గడపడం జరిగిందని నిర్థారణ అయిందని, తరువాత వేరేకారణాలతో రేప్ కేసు పెట్టిందని సాక్షాధారాలతో తేలిందని, తన ప్రత్యేక హక్కును ఆయుధంగా వాడుకునేందుకు దిగడం మహిళ తప్పిదం అని న్యాయస్థానం పేర్కొంది .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News