- Advertisement -
న్యూఢిల్లీ: ‘నేషనల్ హెరాల్డ్ ’ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులకు నోటీసులు జారీచేసేందుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ఫిర్యాదు (అభియోగపత్రానికి సమానమైనది)ను కొత్త చట్టం నిబంధనల కింద విచారణకు స్వీకరించలేమని ప్రత్యేక జడ్జీ విశాల్ గోగ్నే తెలిపారు. ‘అభియోగపత్రంలో కొన్ని దస్తావేజులు మిస్ అయ్యాయి. వాటిని ఈడి దాఖలు చేయాలని ఆదేశించడం జరిగింది. ఆ తర్వాతే నోటీసు ఇవ్వాలో వద్దో అన్నది కోర్టు నిర్ణయిస్తుంది’ అని స్పష్టం చేసింది. ‘తామేమి దాచడం లేదు’ అని ఈడి కోర్టుకు తెలుపుకుంది. కాగా జడ్జీ విచారణను మే 2కు వాయిదా వేశారు.
- Advertisement -