- Advertisement -
లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మార్చి 23వరకూ ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీ పూర్తయ్యాక కవితను మళ్లీ కోర్టులో హాజరుపరుస్తారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత కీలక పాత్ర పోషించారని ఈడి అభియోగం మోపింది.
ఆప్ పార్టీకి వంద కోట్ల రూపాయలు ముట్టడం వెనుక ఆమెది కీలక హస్తమని పేర్కొంది. ప్రత్యేక కోర్టులో సిబిఐ తరఫున ఎన్.కె. మట్టా, జోయబ్ హుస్సేన్ వాదించగా, కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు.
- Advertisement -