Friday, December 20, 2024

ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ బెయిలుపై ఢిల్లీ కోర్టు తీర్పు రిజర్వు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన సీనియర్ ఆప్ నేత సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణను ఢిల్లీ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. గురువారం స్పెషల్ జడ్జి ఎంకె నాగ్‌పాల్ గురువారం బెయిల్ పిటిషన్‌ను పరిశీలించారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తీర్పు ఇస్తారు. ఈ బెయిల్ అప్లికేషన్‌పై డిసెంబర్ 12న కోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. సింగ్ తరఫున సీనియర్ అడ్వకేట్ మొహిత్ మాధుర్ గురువారం విచారణకు హాజరయ్యారు.

సింగ్ అరెస్ట్‌కు ముందు కనీసం ఒకసారైనా విచారించడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సింగ్‌ను పిలవలేదని మాధుర్ వాదించారు. అప్రూవర్‌గా మారిన నిందితుడు దినేష్ ఆరోరా, ఇతర సాక్షుల ప్రకటనల్లో విరుద్ధం కనిపిస్తోందని, ఆరోపించారు. అయితే సంజయ్ సింగ్ బెయిల్ దరఖాస్తును ఈడీ వ్యతిరేకించింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని పేర్కొంది. బెయిల్ ఇస్తే సింగ్ సాక్షాలను తారుమారు చేస్తారని వాదించింది. అయితే దీన్ని సింగ్ తిరస్కరించారు. ఎలాంటి పొరపాట్లు చేయనని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News