Sunday, December 22, 2024

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత జగదీష్ టైట్లర్ యాంటిసిపేటరీ బెయిల్ దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ హైకోర్టు ఈనెల 4 వ తేదీ వరకు రిజర్వు చేసింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో పూల్ బంగాష్‌కు చెందిన ముగ్గురు హత్యకు గురయ్యారు. టైట్లర్, సిబిఐ తరఫున హాజరైన న్యాయవాదుల వాదనలు విన్న తరువాత స్పెషల్ జడ్జి వికాస్ ధుల్ తీర్పును రిజర్వు చేశారు. విచారణ జరుగుతుండగా బాధితురాలైన ఒక మహిళ ఈ సంఘటన జరిగి 39 ఏళ్లు కావస్తున్నా ఇంకా తమకు న్యాయం జరగలేదని కోర్టుకు విన్నవించింది. టైట్లర బెయిల్ దరఖాస్తును సిబిఐ వ్యతిరేకించింది.

ఈ కేసులో సాక్షులు నిర్భయంగా ముందుకు వస్తున్నారని, వారిని ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదని సిబిఐ పేర్కొంది. ప్రాథమికంగా జగదీష్ టైట్లర్ పాత్ర ఉన్నట్టు కొత్తగా వచ్చిన సాక్షుల బట్టి తెలుస్తోందని పేర్కొంది. బాధితుల తరఫున హాజరైన ఫూలికా కూడా బెయిల్ దరఖాస్తును వ్యతిరేకించారు. ఈ కేసును ముగించి వేయడానికి నివేదికను మూడుసార్లు దాఖలు చేయడం, దాన్ని ప్రతిసారి కోర్టు వ్యతిరేకించడం వంటి ఈ కేసు దేశం లోనే మొదటి కేసుగా ఫూలికా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News