Friday, December 20, 2024

కవిత మధ్యంతర బెయిల్‌పై సోమవారం తీర్పు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అ వెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. సోమవారం తీర్పు వెలువరించనుంది. అంతకు ముందు కవిత మధ్యంతర బె యిల్ పిటిషన్‌పై వాదనలు కొనసాగాయి. ఇడి దాఖలు చే సిన కౌంటర్‌పై రిజాయిండర్‌ను కవిత తరఫు న్యాయవాదు లు దాఖలు చేశారు. కుమారుడి పరీక్షల దృష్ట్యా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర బెయిల్‌పై కవిత తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. అయితే బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావి తం చేస్తారని, ఆమెకు వ్యతిరేకంగా చాలా ఆధారాలు ఉన్నాయని ఇడి వాదించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కవితే ప్రణాళిక రచించారన్న ఇడి, ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేశారని కోర్టుకు వెల్లడించింది.

అప్రూవర్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దని కవిత బెదిరించారని ఇడి ఆ రోపించింది. మరోవైపు తన కుమారుడి పరీక్షల కారణంగా బెయిల్ ఇవ్వాలన్న కవిత వాదనను ఇడి వ్యతిరేకించింది. ఆమె చిన్న కుమారుడు ఒంటరి వాడు కాదని, తనకు సోదరుడు, కుటుంబసభ్యులు తోడుగా ఉన్నారని కోర్టుకు వెల్లడించింది. ఆమె కుమారుడి పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని కోర్టు దృష్టికి తెచ్చింది. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 8న ఉదయం 10.30 గంటలకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై ఏప్రిల్ 20న వాదనలు కొనసాగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News