- Advertisement -
న్యూఢిల్లీ: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీ వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో ఒక 70 ఏళ్ల మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జనకు పాల్పడిన నిందితుడు శంకర్ మిశ్రాను పాటియాలా హౌస్ కోర్టు శనివారం 14 రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది. బెంగళూరులో శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన నిందితుడిని ఢిల్లీ పోలీసులు శనివారం ఇక్కడకు తీసుకువచ్చి పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు శంకర్ మిశ్రాను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిలిషన్‌ను కోర్టు తిరస్కరించింది. నవంబర్ 26న ఎయిర్ ఇండియా విమానంలో జరిగిన ఈ సంఘటనపై ఈనెల 4న ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
- Advertisement -