- Advertisement -
న్యూఢిల్లీ: ఎక్సయిజ్ పాలసీ విషయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది. మోసపూరితంగా కుట్రకు పాల్పడ్డారు కనుక ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిబిఐ విచారణ సందర్భంగా వాదించింది. కాగా సిసోడియా న్యాయవాది సిబిఐ రిమాండ్ దరఖాస్తును వ్యతిరేకించారు. ‘ఒకవేళ ఎవరైనా ఏదైనా చెప్పదలచుకోకుంటే, దానిని ఆధారంగా చూపుతూ అరెస్టు చేయనివ్వకూడదు’ అని వాదించారు.
‘ఫోను మార్చితే ఏమి చేయాలి? దానిని సెకండ్ హ్యాండ్ షాపుకు పంపలేను. అందులో ముఖ్యమైన డేటా ఉండొచ్చు. దానిపై సిబిఐ నాతో పెట్టుకుంది, నేను ఒప్పుకోలేదు’ అని మంత్రి లాయర్ అన్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది. ఎక్సైజ్ కుంభకోణం కేసులో ఆదివారం తొమ్మిది గంటలపాటు ప్రశ్నించిన తర్వాత సిబిఐ మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది.
- Advertisement -