Sunday, December 22, 2024

లిక్కర్ స్కాంలో సంజయ్ సింగ్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కోర్టు హాల్‌లో రాజకీయ ప్రసంగం చేసినందుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టు గట్టిగా హెచ్చరించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా వాదనలు వినిపించే క్రమంలో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్రమోడీల పేరు ఎత్తినందుకు సంజయ్ సింగ్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాదనలు జరుగుతాయని న్యాయమూర్తి నాగ్‌పాల్ తెలిపారు.

సంబంధం లేని విషయాల గురించి మాట్లాడవద్దని సంజయ్‌సింగ్‌కు న్యాయమూర్తి హెచ్చరించారు. గౌతమ్ అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో తనను కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని సంజయ్‌సింగ్ న్యాయస్థానానికి తెలిపారు.

‘ నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాను. నాభార్యకు ఎందుకు రూ.10,000 ఎందుకు పంపాను. అనవసరమైన ప్రశ్నలతో ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌గా మారింది. అన్నీ అబద్ధాలే. అదానీపై ఫిర్యాదు చేశాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.’ అని సంజయ్ సింగ్ అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాల రిమాండ్ పెంచాలని ఈడీ అభ్యర్థన మేరకు , న్యాయస్థానం అక్టోబర్ 27 వరకు సంజయ్‌సింగ్ రిమాండ్‌ను పొడిగించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News