Sunday, November 17, 2024

ఇడి ఫిర్యాదు.. కేజ్రీవాల్‌కు కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమ సమన్లను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఇచ్చిన తాజా ఫిర్యాదుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గురువారం సమన్లు జారీచేసింది. మార్చి 16న కోర్టుకు హాజరుకవాలని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ దివ్యా మల్హోత్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆదేశించారు. ఈ కేసులో తాము జారీచేసిన అనేక సమన్లను కేజ్రీవాల్ బేకాతరు చేశారని బుధవారం కోర్టు ఎదుట దాఖలు చేసిన ఫిర్యాదులో ఇడి ఆరోపించింది.

ఇందుకుగాను కేజ్రీవాల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో ఇడి అభ్యర్థించింది. పిఎంఎల్‌ఎలోని సెక్షన్ 50 కింద తాము జారీచేసిన 4వ నంబరు నుంచి 8వ నంబరు సమన్లను కేజ్రీవాల్ బేఖాతరు చేశారని ఇడి తన ఫిర్యాదులో పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో తాము జారీచేసిన మొదటి సమన్లకు హాజరుకానందుకు కేజ్రీవాల్‌ను ప్రాసిక్యూట్ చేయాలని కోరుతూ స్థానిక కోర్టులో ఇడి ఇదివరకు ఒక పటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News