- Advertisement -
న్యూఢిల్లీ : హవాలా కేసుకు సంబంధించిన కర్ణాటక కాంగ్రెస్ (కెపిసిసి) చీఫ్ డీకే శివకుమార్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఛార్జిషీట్ ఆధారంగా ఈ నోటీసులు పంపారు. అంతే కాకుండా జులై 1 లోపు కోర్టు ముందు హాజరు కావాలని డీకేను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో డీకేను మూడేళ్ల క్రితం అరెస్ట్ చేశారు. 2017,2018 మధ్య చేసిన తనిఖీల ఆధారంగా 2019 సెప్టెంబర్‌లో డీకేను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కాగా, ఈకేసుపై ఈడీ తాజాగాఛార్జిషీటు పూర్తి చేసి గురువారం కోర్టుకు అందించింది. ఇదంతా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా డీకే విమర్శించారు. బిజేపి పేరు ఆయన ప్రస్తావించలేదు. ఏదైనా ఉంటే ఇన్నేళ్ల పాటు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సాధారణంగా తనను అరెస్టు చేయడానికి 60 రోజులు ముందు ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంటుందని డీకే అన్నారు.
- Advertisement -