- Advertisement -
న్యూఢిల్లీ : కాళీ చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్ వివాదాస్పదంగా మారి దుమారం చెలరేగడంతో అందిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ కోర్టు ఆ చిత్రం దర్శకురాలు లీనా మణిమేగలైకి సమన్లు జారీ చేసింది. ఆగస్టు 6న విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. ఆ పోస్టర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని గో మహాసభ ప్రతినిధులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ లోనూ కేసులు నమోదయ్యాయి. కాళీ డాక్యుమెంటరీ నిర్మాణ సంస్థ టూరింగ్ టాకీస్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కూడా నోటీసులు పంపారు. డాక్యుమెంటరీ నిర్మాతలపైనా ఉద్దేశపూర్వకంగా మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం, నేరపూరిత కుట్ర, శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం వంటి అభియోగాలు నమోదయ్యాయి.
- Advertisement -