Sunday, September 8, 2024

అనుబంధ చార్జిషీట్‌పై కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఏడవ అనుబంధ చార్జిషీట్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం పరిగణనలోకి తీసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిందితులుగా అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది.

ఏడవ అనుబంధ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న పత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా జులై 12న కోర్టులో హాజరుకావాలని ఆదేశిస్తూ కేజ్రీవాల్‌కు సమన్లు జారీచేశారు. ఈ ఏడాది మార్చి 21న ఆప్ జాతీయ కన్వీనర్ కూడా అయిన 55 ఏళ్ల కేజ్రీవాల్‌ను ఇడి ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది. ఎక్సైజ్ కుంభకోణంలో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి, ప్రధాన కుట్రదారుగా ఇడి ఆరోపించింది. ఈ కుంభకోణానికి ఆయనే ప్రధాన కారకుడని కూడా ఇడి ఆరోపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News