Wednesday, November 6, 2024

లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్యకు సమన్లు!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భూమికి బదులు ఉద్యోగం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ చిక్కులు పెరుగనున్నాయి. ఢిల్లీలోని ఓ కోర్టు ఉద్యోగ కుంభకోణంలో సోమవారం మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్డీ దేవీ సహా 14 మంది ఇతరులకు సమన్లు పంపింది. 2004 నుంచి 2009 వరకు లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందీ కుంభకోణం.

యుపిఏ 1 ప్రభుత్వ హయాంలో ఈ కుంభకోణం చోటుచేసుకుంది. బీహార్‌లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని, వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పించారని వీరిపై సిబిఐ కేసు నమోదు చేసింది. భూములు బహుమతులుగా ఇవ్వడం, లేక వాటిని అమ్మడం జరిగింది.

ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయల్ ఆరోపితులను మార్చి 15న న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ఆదేశాలిచ్చారు. నిందితులు సెక్షన్లు 120బి, 420, 467, 468, 471ల కింద బుక్ అయ్యారు. అక్రమాలు, వివిధ చట్టాల కింద వారు నేరం చేశారు. ఫైనల్ రిపోర్టులో లాలూ ప్రసాద్ కూతురు మీసా భారతి, మధ్య రైల్వే మాజీ డైరెక్టర్ సౌమ్య రాఘవన్, రైల్వే మాజీ సిపిఓ కమల్ దీప్, మరో నలుగురిపై ఆరోపణలు నమోదయ్యాయి. అభ్యర్థులు బీహార్‌కు చెందిన వారైనప్పటికీ వారిలో కొంత మంది ముంబై, జబల్‌పూర్, కోల్‌కతా, జయ్‌పూర్, హాజీపూర్ లో రైల్వే విభిన్న శాఖల్లో గ్రూప్‌డి ఉద్యోగాలు పొందారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News