Monday, December 23, 2024

కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ కోర్టు సమన్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : రెండు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాల్లో ఓటరుగా నమోదైనట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతపై ఆరోపణలు రావడంతో ఢిల్లీ తీస్ హజారీ కోర్టు సమన్లు జారీ చేసింది. రెండు వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదు చేయించుకోవడం ప్రజాప్రాతినిధ్య చట్టం ఉల్లంఘనగా పరిగణించాలని కోరుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని సాహిబాబాద్, ఢిల్లీ లోని చాందినీ చౌక్ నియోజకవర్గాల ఓటరు జాబితాలో సునీత కేజ్రీవాల్ పేరున్నట్టు తెలిసింది.

ఈమేరకు తీస్‌హజారీ కోర్టు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ అర్జిందర్ కౌర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారు, ఇతర సాక్షుల వాంగ్మూలాన్ని పరిగణన లోకి తీసుకున్న తరువాత సునీత కేజ్రీవాల్‌పై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్టు న్యాయస్థానం భావిస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 31 ప్రకారం శిక్షార్హమైన నేరాలు చేసినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అందువల్ల సమన్లు జారీ చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. సమన్ల జారీకి ముందు సాక్షాధారాలు, వాంగ్మూలాలు పరిగణన లోకి తీసుకున్నట్టు కోర్టు పేర్కొంది. తీస్‌హజారీ కోర్టు నవంబర్ 18న ఈ కేసు విచారణ చేపట్టనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News