- Advertisement -
పరువునష్టం కేసులో నర్మద బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు విధించిన ఐదు నెలల సాధారణ జైలు శిక్షను ఢిల్లీ కోర్టు సోమవారం నిలిపివేసింది. 23 సంవత్సరాల క్రితం గుజరాత్‌లో ఒక ఎన్‌జిఓ నిర్వహిస్తున్న సమయంలో తనకు పరువునష్టం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ మేధా పాట్కర్‌పై ఇప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా పరువునష్టం కేఉ దాఖలు చేయగా మే 24న కోర్టు ఆమెకు ఐదు నెలల కారాగార శిక్ష విధించింది.
అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఆమె అప్పీలు దాఖలు చేయగా స్థానిక కోర్టు జైలు శిక్షను సోమవారం నిలిపివేస్తూ సక్సేనా తరఫు న్యాయవాది గజీందర్ కుమార్‌కు నోటీసు జారీచేసింది. రూ. 25,000 పూచీకత్తుపై ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 4న తదుపరి విచారణ లోగా తాను నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉందని న్యాయవాది గజీందర్ కుమార్ తెలిపారు.
- Advertisement -