న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో మరోవారం పాటు లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3 ఉదయం 5గంటల వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సంధర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో ఇంకా కరోనా ఉద్ధృతి తగ్గలేదన్నారు. ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు కృషిచేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న రికార్డుస్థాయిలో 357 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం కేజ్రీవాల్ అన్ని రాష్ర్టాల సిఎంలకు విజ్ఞప్తి చేస్తూ ఓ ట్వీట్ చేశారు. మీ రాష్ర్టాల్లో ఉండాల్సిన ఆక్సిజన్ కంటే ఏక్కువగా ఉంటే ఢిల్లీకి పంపాలని, ఇక్కడ ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందన్నారు. ఆక్సిజన్ సరఫరా విషయంలో కేంద్రం తమకు సహకరిస్తుందని ఆయన తెలిపారు. కాగా, గతవారంలో కరోనాపై సమీక్ష నిర్వహించిన ఆయన కోవిడ్-19 ఉధృతి దృష్ట్యా 6 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.
Delhi Covid-19 lockdown extended by a week