Wednesday, January 22, 2025

ఎక్సెయిజ్ పాలసీ డాక్యుమెంట్లు కోరిన సిసోడియా

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఢిల్లీ ఎక్సైయిజ్ పాలసీ 2021-22 రూపొందించిన సంబంధిత డాక్యుమెంట్లను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అక్టోబర్ 30న ఎక్సైయిజ్ కమిషనర్, ఇతర సంబంధిత శాఖల నుంచి కోరారని అధికార వర్గాలు గురువారం తెలిపాయి. ఉపముఖ్యమంత్రికి సంబంధించిన ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్‌డి) ఎంకె. నిఖిల్ సంతకం చేసిన ఎక్సైయిజ్ పాలసీ 202122కు సంబంధించిన స్కాన్డ్ కాపీలు, ఫోటో కాపీలు, టెండర్ డాక్యుమెంట్లు వెంటనే ఇవ్వాల్సిందిగా ఆయన కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా లిక్కర్ స్కామ్‌లో నిందితుడైన సిసోడియా తన రాజ్యాంగ హోదాను దుర్వినియోగం చేస్తున్నారని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. సిబిఐ, ఈడి, ఈవోడబ్లు, ఆదాయపు పన్ను శాఖ జరుపుతున్న దర్యాప్తులో సిసోడియా ప్రధాన నిందితుడని కూడా ఆ వర్గాలు ఉటంకిస్తున్నాయి.

ఎంఎల్‌ఏలకు రొక్కం స్కామ్ ఆరోపణలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుని రావాలని సిసోడియా ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో ఎంఎల్‌ఏలను కొనడానికి ఎవరు వెళ్లారో, రూ. 100 కోట్ల ఎవరు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారో ప్రజలకు చెప్పాలి. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో వారు కనుగొన్నదేమిటో కూడా చెప్పాలి. మోడీజీ, ఆ వంద కోట్లు ఎవరి నుంచి అతడు తీసుకున్నాడు?” అంటూ సిసోడియా ప్రశ్న సంధించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, నాటి ఎక్సైయిజ్ కమిషనర్ అర్వ గోపి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ నిందితులుగా ఉన్నారు. కాగా ఎక్సైయిజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని ఈడి, సిబిఐ ఆరోపిస్తున్నాయి. ముడుపులు చెల్లించారని అంటున్నారు. ఎక్సైయిజ్ పాలసీ స్కామ్‌లో ‘లుకౌట్ నోటీస్’ను జారీచేసిన సిబిఐ, అందులో ఎనిమిది మంది పేర్లను పేర్కొంది. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం మొత్తం తొమ్మిది మంది పేర్లను నిందితులుగా పేర్కొంది. మనోజ్ రాయ్ పేరును మినహాయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News