Wednesday, January 22, 2025

కారు బానెట్‌పై 3 కిలోమీటర్లు…. డ్రైవర్ అరెస్టు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగా కారు బానట్‌పై ఒక వ్యక్తి 2, 3 కిలోమీటర్ల దూరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించవలసి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ కారు బీహార్ ఎంపి చందన్ సింగ్‌కు చెందినదిగా తెలుస్తోంది. అయితే, బానట్‌పై ప్రయాణించిన వ్యక్తికి ఎటువంటి గాయాలు కాలేదు.

బాధితుడు చందన్ కథనం ప్రకారం..కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అతను ఒక ప్రయాణికుడిని దించి వస్తుండగా ఆశ్రమ్ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఒక కారు అతని కారును ఢీకొంది. రానే దిగి చేతన్ వెనుక వచ్చిన కారు ముందు నిలబడ్డాడు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారు ఆపకుండా ముందుకు పోనియ్యడంతో చేతన్ బానట్ మేద ఎగిరిపడ్డాడు. కారును ఆపాలని ఎంత బతిమాలినా కారులోని వ్యక్తి ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.

ఆశ్రమ్ చౌక్ నుంచి నిజాముద్దీన్ వరకు తాను కారు నానట్‌పైనే వేలాడుతూ ఉన్నానని అతను చెప్పాడు. కారు నడుపుతున్న వ్యక్తి పూటుగా తాగేసి ఉన్నాడని, అతను కారు ఆపకుండా వేగంగా పోనిచ్చాడని చేతన్ తెలిపాడు. ఇంతలో ఒక పోలీసు పెట్రోలింగ్ వాహనం తనను చూసి కారును వెంబడించుకుంటూ వచ్చి అడ్డగించిందని బాధితుడు చెప్పాడు. కాగా..నిర్లక్ష్యంగా కారును నడిపిన రామచంద్ కుమార్ కథనం వేరేగా ఉంది. తన కారు చేతన్ కారును తాకలేదని, కావాలనే అతను తన కారు బానట్‌పై దూకాడని అతను చెప్పాడు. దిగమన్నా బానట్‌పై నుంచి దిగకుండా అలానే వచ్చాడని కుమార్ తెలిపాడు. కారును ఆపి బానట్‌పై ఏం చేస్తున్నావని తాను చేతన్‌ను ప్రశ్నించినట్లు అతను చెప్పాడు. మొత్తానికి పోలీసులు మాత్రం రామచంద్ కుమార్‌పై వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Also Read:  అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News