Saturday, April 19, 2025

ఢిల్లీ ద్వారకా కోర్టుకు బాంబు బెదరింపు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీలోని ద్వారకా కోర్టుకు బాంబు బెదరింపు వచ్చిన అనంతరం బుధవారం ఉదయం కోర్టును ఖాళీ చేయించినట్లు, ఆ బెదరింపు బోగస్‌దిగా ఆతరువాత తేలినట్లు పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం, కోర్టు ఆవరణలో ఒక బాంబును అమర్చినట్లు కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు బుధవారం తెల్లవారు జామున 3.11 గంటలకు ఒక ఇమెయిల్ అందింది. కోర్టు నుంచి పోలీసులకు బుధవారం ఉదయం 10.50 గంటలకు ఒక కాల్ వచ్చిందని పోలీస్ అధికారి తెలిపారు. కోర్టు భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత అది బోగస్ బెదరింపుగా ప్రకటించారని ఆయన చెప్పారు. ఒక తమిళ చిత్ర నిర్మాతను 2024లో సూత్రధారునిగా గుర్తించిన రూ. 2000 కోట్ల డ్రగ్స్ కుంభకోణంలో దర్యాప్తును ఆపని పక్షంలో కోర్టులను పేల్చివేస్తామని మెయిలర్ బెదరించినట్లు పోలీస్ వర్గాలు తెలియజేశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News