Sunday, December 22, 2024

మెట్రో స్టేషన్ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్న సంఘటన ఢిల్లీలోని ద్వారకా మెట్రో స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రమేష్ అనే వ్యక్తి భరత్ విహార్‌లో నివసిస్తున్నాడు. రమేష్ స్నాక్స్ అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ద్వారకా మెట్రో స్టేషన్ సమీపంలో అతడు చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News