Thursday, January 23, 2025

క్షీణించిన సత్యేంద్ర జైన్ ఆరోగ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జైలులో ఉన్న ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సత్యేంద్ర జైన్ ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స కోసం స్థానిక సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. సంబంధిత వివరాలు పూర్తిగా తెలియలేదు. మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయ్యి, జైలు పాలయిన మాజీ మంత్రి ఈ నెల 15న సుప్రీంకోర్టులో బెయిల్‌కు అప్పీల్ చేసుకున్నారు.

ఢిల్లీ హైకోర్టు తన బెయిల్‌ను నిరాకరించడాన్ని సుప్రీంలో సవాలు చేశారు. ఇడి తనపై వెలువరించిన అభియోగాలు, తరువాతి క్రమంలో విచారణకు సంబంధించి తాను దర్యాప్తు సంస్థ ఎదుట ఏడుసార్లు హాజరయ్యానని, దర్యాప్తు క్రమంలో అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నానని కోర్టుకు తెలియచేసుకున్నారు. బెయిల్ దక్కని ఈ మాజీ మంత్రి ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి క్షీణతతో ఆసుపత్రి పాలు అయ్యారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News