Monday, March 10, 2025

మోడీకి జైకొట్టిన ఢిల్లీ!

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీల్లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. 27 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాషాయ పార్టీ (బిజెపి) ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి పోటీ ఇచ్చింది. మరొకసారి అధికారాన్ని కాపాడుకునేందుకు ఆప్ కూడా తీవ్రంగా శ్రమించింది. మరొక పూర్వపు అధికార పక్షం కాంగ్రెస్ ప్రభావం మాత్రం పెద్దగా కనిపించలేదు. మొత్తంగా ఆప్. బిజెపి మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బిజెపి వైపే ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఢిల్లీలో 70 స్థానాలు ఉండగా, మెజారిటీ మార్క్ 36. ఆప్ 32 నుంచి 37 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసిన మాట్రిజ్ సంస్థ బిజెపికి 3540 సీట్లు వస్తాయని సూచించింది. పీపుల్స్ పల్స్ బిజెపికి 51 నుంచి 60 సీట్లు రావచ్చునని అంచనా వేసింది.

విప్రిసైడ్ అనే సంస్థ ఆప్‌కు 4652, బిజెపికి 1823 సీట్లు వస్తాయని సూచించింది. ఇలా కొన్ని సర్వేలు మినహా తక్కినవన్నీ బిజెపినే అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ఢిల్లీని 1998 నుంచి 2013 వరకు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఈ సారీ భంగపాటు తప్పకపోవచ్చునని తెలుస్తోంది., 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలుచుకోలేని కాంగ్రెస్ ఈసారీ ఖాతా తెరవకపోవచ్చునని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలు ఇదే విధమైన ఫలితాలను ఊహించాయి. ఆయా సర్వేల అంచనాలు ఎలా ఉన్నాయంటే&ఎన్నికల ఫలితాలు ఎలా ఉండవచ్చో ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. ఎన్నికల్లో ప్రజలు బిజెపికే పట్టం కట్టబోతున్నారని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అవి చెబుతున్నాయి.

ఏయే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయంటే..
సంస్థ            బిజెపి ప్లస్      ఆప్ ప్లస్     కాంగ్రెస్     ఇతరులు
పీపుల్స్ పల్స్   51-60          10-19        0            0
మ్యాట్రిజ్         35-40         32-37        01           0
పీపుల్స్ ఇన్‌సైట్ 40-44        25-29         01           0
టైమ్స్ నౌ        39-45        22-31         02           0
పి మార్క్        39-49        21-31         01           0
జెవిసి పోల్      39-45        22-31         02           0
పోల్‌డైరీ         42-50        18-25         02           0
చాణక్య స్ట్రాటజీస్ 39-44        25-28        23            0
విప్రిసైడ్         18-23        46-52         02            0
కెకె సర్వే           26           44           0              0
మైండ్‌బ్రింక్      21-25      44-49        01             0

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News