Monday, December 2, 2024

రైతుల నిరసన.. 10 కిమీ మేర ట్రాఫిక్ జామ్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం తమ ఐదు డిమాండ్లను అమలు చేయనందుకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీ, నోయిడా సరిహద్దుల్లో రైతులు సోమవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్లమెంట్‌లో ప్రస్తుతం శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాల ప్రకారం పరిహారం, ప్రయోజనాల కోసం రైతు సంస్థలు తమ ఐదు ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని కోరుతున్నాయి. రైతుల నిరసన కారణంగా ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆయా మార్గాల్లో ట్రాఫిక్ మళ్లించడంతోపాటు అనేక చర్యలు పోలీసులు చేపట్టారు. దీంతో ఢిల్లీ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 10 కిమీ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పలువురు రైతు నేతలను గృహ నిర్బంధంలో ఉంచారు. ఢిల్లీకి రైతులను వెళ్లకుండా అడ్డుకోడానికి నాలుగు వేలకు పైగా పోలీస్ వాహనాలు రోడ్లపై మోహరించాయి. పరిస్థితిని పరిష్కరించి, ఎక్స్‌ప్రెస్ వేను నియంత్రించేందుకు నిరసన కారులతో అధికారులు చర్చలు జరుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News