Monday, December 23, 2024

నీళ్ల కోసం మహిళను పొడిచి చంపిన బాలిక

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మంచి నీళ్ల కోసం గొడవ జరగడంతో ఓ మహిళను 15 ఏళ్ల బాలిక పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని ఫార్శా బజార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. భికమ్ సింగ్ కాలనీలో సోని(34), తన భర్త సత్‌బీర్ సింగ్‌తో కలిసి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కోసం పక్కింటి వారితో సోని గొడవ పెట్టుకుంది. ఘర్షణ తారా స్థాయికి చేరుకోవడంతో పక్కింట్లో ఉండే బాలిక కత్తి తీసుకొని సోని చేతులు, పొట్టపై పొడిచింది. రక్తపు మడుగులో ఉన్న సోనిని వెంటనే హెడ్గేవార్ ఆస్పత్రికి తరలించారు. బలమైన గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోని దుర్మరణం చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలికను అరెస్టు చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News