Thursday, December 26, 2024

రూ.70 వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు….. భార్యను చంపి అడవిలో పడేశాడు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భార్యకు 70 వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు కానీ ఆమె ప్రవర్తన నచ్చకపోవడంతో చంపేసి మృతదేహాన్ని అడవిలో పడేసిన సంఘటన ఢిల్లీలోని ఫతేహపూర్ బేరీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ధరమ్‌వీర్ అనే వ్యక్తి ఓ మహిళకు రూ.70 వేలు ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆమె భర్తకు చెప్పకుండా కొన్ని నెలల పారిపోవడంతో భార్యపై అతడు ఆగ్రహంగా ఉన్నాడు. భార్య ఇంటికి తిరిగి వచ్చిన తరువాత బయటకు వెళ్దామని ఆమెకు చెప్పాడు. అరుణ్, సత్యవాన్‌తో కలిసి భార్యను ధరమ్ వీర్ ఆటోలో బయటకు తీసుకెళ్లారు. ఫతేపూర్ బేరీలోని ఝీల్‌ఖుర్డ్ సరిహద్దుకు ఆమెను తీసుకెళ్లాడు. ఆమె గొంతు నులిమి చంపేసి అనంతరం అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని పడేశారు.

Also Read: మణిపూర్‌లో సామూహిక అత్యాచారంపై మరో మహిళ ఫిర్యాదు

అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని మృతదేహం కావడంతో సిసి కెమెరాల ఆధారంగా ఆ స్థలానికి ఆటో వచ్చినట్టు గుర్తించారు. ఆటోను ట్రాక్ చేసి అరుణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా తామే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. వెంటనే ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళ మాత్రం తన తల్లిదండ్రులు గురించి తనకు చెప్పలేదని భర్త ధరమ్ వీర్ పోలీసులకు తెలిపాడు. ఆమె బీహార్‌లోని పాట్నా నుంచి వచ్చినట్లు పలుమార్లు తనకు ఆమె చెప్పిందని భర్త పోలీసుల విచారణలో తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News