చెన్నై: ఐఫిఎల్ 18వ సీజన్‌లో భాగంగా చెపాక్ స్టేడియం వేదికగా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్ కెఎల్ రాహుల్ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఇన్నింగ్స్ ప్రారంభించిన రాహుల్ చివరి వరకూ బ్యాటింగ్ చేసి జట్టు మంచి స్కోర్ సాధించడంలో తన వంతు సహాయం అందించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులు చేసి.. చెన్నై బౌలర్లతో ఓ ఆట ఆడుకున్నాడు. రాహుల్‌తో పాటు అభిషేక్ పొరేల్(33), ట్రిస్టన్ స్టబ్స్ (24), అక్షర్ పటేల్ (21), సమీర్ రిజ్వీ(20)లు కూడా ఉన్నంతలో తమ వంతు సహకారాన్ని అందించారు. అయితే చెన్నై బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. భారీగా పరుగులు చేయకుండా ఢిల్లీ బ్యాటర్లను అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్ 2, జడేజా, నూర్ అహ్మద్, పతిరానా తలో వికెట్ తీశారు.
అదరగొట్టిన రాహుల్.. చెన్నై టార్గెట్ ఎంతంటే..
- Advertisement -
- Advertisement -
- Advertisement -