Monday, April 21, 2025

అదరగొట్టిన బ్యాటర్లు.. గుజరాత్ లక్ష్యం ఎంతంటే..

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు అదరగొట్టారు. ఒకవైపు వికెట్లు పడుతున్న దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ.. గుజరాత్‌కు 204 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ రెండో ఓవర్‌లోనే అభిషేక్ పొరెల్(18) వికెట్ కోల్పోయింది. ఈ దశలో కెఎల్ రాహుల్, కురుణ్ నయర్‌లు భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేశారు. కానీ, ప్రషిధ్ బౌలింగ్‌లో రాహుల్(28) ఎల్‌బిడబ్ల్యూ రూపంలో పెవిలియన్ బాటపట్టాడు. ఇక తొమ్మిదో ఓవర్‌ వేసిన ప్రషిధ్ దూకుడుగా ఆడుతున్న కరుణ్ నయర్‌(31)ని కూడా ఔట్ చేశాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చిన బ్యాట్స్‌మెన్ గుజరాత్ బౌలర్ల నుంచి పరుగులు రాబట్టారు. అక్షర్ పటేల్ 39, అషుతోష్ 37, స్టబ్స్ 31 పరుగులు చేసి ఔట్ అయ్యారు. మరోవైపు గుజరాత్ బౌలర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ప్రషిద్ కృష్ణ 4, సిరాజ్, అర్షద్, ఇశాంత్, సాయి కిషోర్ తలో వికెట్ తీశారు. దీంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News