- Advertisement -
న్యూఢిల్లీ : ఉపాధి కల్సన, ఎలక్ట్రానిక్స్ ఉత్పతుల్త లక్ష్యంగా ఢిల్లీలో ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా కొత్తగా 80,000 ఉద్యోగాలు రానున్నట్లు తెలిపింది. శనివారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఈ ప్రకటన చేశారు. బప్రోలాలో ఎలక్ట్రానిక్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సిసోడియా తెలిపారు. దీంతో ఐటి కంపెనీలుకూడా దేశ రాజధాని వైపు అడుగులేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -