Thursday, September 19, 2024

మార్కెట్ల మూసివేతకు కేంద్రం నుంచి అనుమతి కోరిన కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

Delhi Govt Asks for Centre's Permission to Close Markets

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చట్టపరమైన చర్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ దృష్టి సారించారు. ఇప్పటికే దీనిపై కేంద్రానికి నివేదిక పంపామని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాకు తెలిపారు. వైరస్ హాట్‌స్పాట్లుగా మారుతున్న మార్కెట్లను మూసి వేయాలని, పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు సభ్యుల సంఖ్యను 50కి పరిమితం చేయాలని ప్రతిపాదించినట్టు కేజ్రీవాల్ తెలిపారు. గతంలో ఇలాంటి వేడుకలకు 200మందికి అనుమతి ఇచ్చామని గుర్తు చేశారు. భౌతిక దూరం పాటించని మార్కెట్లు కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్లుగా మారుతున్నందున కొన్ని రోజులపాటు ఆంక్షలు విధించక తప్పదని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్‌బైజల్‌కు దీనిపై ప్రతిపాదనలు పంపానని, త్వరలోనే అనుమతి ఇస్తారని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఢిల్లీలో కొవిడ్19 థర్డ్ వేవ్ ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్నట్టుగా భావిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News