Wednesday, January 22, 2025

ఢిల్లీలో టపాసులపై నిషేధం

- Advertisement -
- Advertisement -

Delhi govt ban on firecrackers

న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించడానికి ప్రభుత్వం మరోసారి దీపావళి సందర్భంగా టపాసులపై పూర్తి నిషేధం విధించింది. 2023 జనవరి 1 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ బుధవారం ఈ విషయం వెల్లడించారు. “ అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, విక్రయాలు, వినియోగంపై పూర్తి నిషేధం విధిస్తున్నాం. అప్పుడే ప్రజల ప్రాణాలను కాపాడగలం.ఈ సారి ఆన్‌లైన్ విక్రయాలపై కూడా ఆంక్షలు విధించాం. వచ్చే జనవరి వరకు ఈ నిషేధం అమలులో ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది సెప్టెంబరు 28 నుంచి 2022 జనవరి 1 వరకు ఢిల్లీలో బాణాసంచా విక్రయాలు, వినియోగంపై పూర్తిగా నిషేధం విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News