న్యూఢిల్లీ: నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు 1 శాతం, అంతకంటే తక్కువ స్థాయిలో కొనసాగుతుండటంతో, ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (డిడిఎంఏ) శుక్రవారం దేశ రాజధానిలో విధించిన కోవిడ్-19 అన్ని ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుండి పాఠశాలలను తెరిచేందుకు అనుమతించింది. ఫిబ్రవరి 28, సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సంబంధిత వర్గాలు తెలిపాయి. మాస్క్‌లను ఉల్లంఘించడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి వాటిపై విధించే జరిమానాను రూ.2000 నుంచి రూ.500కి తగ్గించింది. డిడిఎంఏ సమావేశంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఆరోగ్య, రెవెన్యూ శాఖల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేజ్రీవాల్ ట్విట్టర్‌లో సడలింపులను ప్రకటించారు. నగరంలో కోవిడ్ కేసులు పెరిగితే మళ్లీ ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఢిల్లీ సర్కార్ ప్రకటించింది.
DDMA withdraws all restrictions as situation improves n people facing hardships due to loss of jobs
Schools to function fully offline from 1 Apr
Fines for not wearing masks reduced to Rs 500
All shud continue following Covid Appropriate Behaviour. Govt will keep strict watch
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 25, 2022