Saturday, November 16, 2024

ఢిల్లీలో మరో వారం లాక్‌డౌన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్‌ను మరో వారం రోజులు పొడిగించారు. ఈ విషయాన్ని ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటికీ కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈసారి ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయి. కనీసంవారం రోజుల పాటు మెట్రో రైళ్లు ప్రయాణాలు ఉండవు. సేవలను నిలిపివేయాల్సి వస్తోందని పేర్కొన్నారు. తాను ఇటీవలి కాలంలో పలువురు వ్యాపారులు, మహిళలు, యువతతో మాట్లాడినట్లు ఇటీవలి కాలంలో కేసులు క్రమేపీ తగ్గుతున్నట్లు తెలిపారని చెప్పారు. అయితే దీనిని చూసి వెనువెంటనే లాక్‌డౌన్ ఎత్తివేయరాదని, పరిస్థితిని మరింతగా గమనించి కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టే వరకూ లాక్‌డౌన్ ఉండాల్సిందేనని పలువురు తెలిపారని ముఖ్యమంత్రి చెప్పారు. ఉన్నట్లుండి లాక్‌డౌన్ ఎత్తివేస్తే తిరిగి కరోనా తీవ్రత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం అయిందని, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేజ్రీవాల్ వివరించారు.

ఇప్పటివరకూ ఢిల్లీలో లాక్‌డౌన్ దశలోనూ 50 శాతం కెపాసిటి, 30 నిమిషాల విరామంతో మెట్రోరైళ్లు నడుస్తూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు నియంత్రణ దిశలో భాగంగా మెట్రోరైలు సేవలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు కేజ్రీవాల్ తెలిపారు. రాజధానిలో తొలుత వారం రోజుల లాక్‌డౌన్‌ను ఎప్రిల్ 19 పెట్టారు. తరువాతి దశలో అనుకున్న విధంగా కేసులు అదుపులోకి రాకపోవడంతో తిరిగి సమీక్షలకు దిగి లాక్‌డౌన్‌లు పొడిగిస్తూ వచ్చారు. ఇప్పుడు తిరిగి ఈ అవస్థ పొడిగింపు అనివార్యం అయింది. లాక్‌డౌన్‌ల నిర్ణయంతో ఢిల్లీలో ఇప్పటికి 35 శాతం వరకూ పాజిటివ్ రేటు తగ్గిందని ఇది మంచి పరిణామం అయిందని కేజ్రీవాల్ తెలిపారు.

Delhi Govt Extend Lockdown by one more week

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News