Sunday, September 8, 2024

ఢిల్లీకి 6వేల చైనా సిలిండర్లు

- Advertisement -
- Advertisement -

Delhi Govt Imported 6000 Oxygen Cylinder From China

థర్డ్‌వేవ్‌తో ఢీకి కేజ్రీవాల్ రెడీ

న్యూఢిల్లీ : కరోనా థర్డ్ వేవ్ ఎప్పుడొచ్చినా తట్టుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం సమాయత్తం అయింది. చైనా నుంచి 6000 ఆక్సిజన్ సిలిండర్లను దిగుమతి చేసుకున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఇక్కడ తెలిపారు. వీటిని మూడు ఆక్సిజన్ డిపోలలో నిల్వ చేసి ఉంచుతారు. కరోనా తీవ్రత ముదిరి థర్డ్‌వేవ్ సంభవిస్తే వాడేందుకు వీటిని తెప్పించి నిల్వలో ఉంచినట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఇప్పుడు క్రమేపీ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోందని, తరువాతి ఎటువంటి పరిణామాన్ని అయినా సమర్థవంతంగా తట్టుకునేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అత్యవసర ప్రాతిపదికన చైనా నుంచి మెడికల్ ఆక్సిజన్ల దిగుమతికి సంబంధించి తాను విదేశాంగ మంత్రిత్వశాఖకు, బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.

మొత్తం 6వేల సిలిండర్లు విమానాల ద్వారా అందుతున్నాయి. వీటిలో ఇప్పటికైతే 4400 సిలిండర్లు ఇక్కడికి చేరుకుని స్టోర్‌లకు వెళ్లాయి. మిగిలినవి వచ్చే రెండు మూడు రోజులలో చేరుకుంటాయని వివరించారు. సిలిండర్లను నిల్వ చేసేందకు నగర ప్రభుత్వం మూడు స్టోరేజ్ డిపోలను ఏర్పాటు చేసింది. 6వేల ఆక్సిజన్ సిలిండర్లను 3వేల ఆక్సిజన్ బెడ్స్ కోసం వినియోగించుకోవచ్చు. కరోనా మహమ్మారి తలెత్తిన తరువాత దేశానికి ఇంత పెద్ద సంఖ్యలో ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు రావడం ఇదే తొలిసారి అయి ఉంటుందని కేజ్రీవాల్ చెప్పారు. హెచ్‌సిఎల్, గివ్ ఇండియా ఫౌండేషన్‌లు ఆక్సిజన్ సిలిండర్ల కోసం విరాళాలు ఇచ్చాయని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News