Sunday, January 19, 2025

ఢిల్లీలో నీటి ఎద్దడి…సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున పొరుగు రాష్ట్రాలైన హర్యాన, ఉత్తర్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అదనపు త్రాగునీరు పొందేందుకుగాను ఢిల్లీ ప్రభుత్వం శుక్రవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్రాలు నీటి సరఫరాను తగ్గించేశాయని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు.

‘‘బిజెపి ఒకవేళ హర్యాన, యూపీ ప్రభుత్వాలతో మాట్లాడితే నెలకు సరిపడ నీరు ఢిల్లీకి అందగలదు. అందుకు ఢిల్లీ ప్రజలు బిజెపికి రుణపడి ఉంటారు. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. అంతా కలిసి పనిచేస్తే కొంత రిలీఫ్ చేకూరగలదు’’ అని కేజ్రీవాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

నీటిని వృథా చేసే వారిపై, అక్రమ కనెక్షన్ కలుపుకున్న వారిపై రూ. 2000 జరిమానను కూడా ఢిల్లీ ప్రభుత్వం విధిస్తోంది. వివేకనంద కాలనీ, చాణక్యపురి, బురారీ వంటి ప్రాంతాల్లో ప్రజలు నీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ప్రతి ఏడాది వేసవిలో ఈ సమస్య ఉంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News