Tuesday, September 17, 2024

ఐఎఎస్ అధికారికి ఢిల్లీ ప్రభుత్వం షోకాజ్ నోటీస్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బదిలీ ఉత్తర్వును ఉల్లంఘించిన సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ , ఐఎఎస్ అధికారి ఆశిష్ మోర్‌కు ఢిల్లీ ప్రభుత్వం ఈనెల 13న షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆయన ఫోన్ స్విచాఫ్ చేసి పరారీలో ఉన్నట్టు ఆరోపించింది. ఆశిష్‌ను పదవి నుంచి తప్పించడంతో ఢిల్లీ, కేంద్ర మధ్య మరోసారి వివాదం తలెత్తింది. ఢిల్లీలో పబ్లిక్ ఆర్డర్, పోలీస్, ల్యాండ్ అండ్ ఆర్డర్ తప్పించి మిగతా అన్ని శాఖలపై అధికారం, నియంత్రణ, శాసనాధికారం ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టు గత వారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన గంట వ్యవధి లోనే ఆశిష్ మోరె ను కేజ్రీవాల్ ప్రభుత్వం ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో ఢిల్లీ జల్‌బోర్డు మాజీ సిఈవో ఎ. కె. సింగ్‌ను నియమించింది. నూతన అధికారి నియామకం ఫైల్ సమర్పించాలని సర్వీసెస్ శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ గత గురువారం ఆశిష్‌కు సూచించారు.

Also Read: ఖర్గేపై బజరంగ్‌దళ్ రూ.100 కోట్ల పరువు నష్టం కేసు

కానీ ఆయన ఎవరికీ చెప్పకుండా సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది. అయితే ఈ బదిలీని కేంద్రం అమలు చేయకపోవడాన్ని ఆప్ సర్కార్ ప్రశ్నించింది. ఆశిష్ కనిపించక పోవడంతో తాజాగా ఆయనకు తాజాగా షోకాజ్ నోటీస్‌లు జారీ చేసింది. 24 గంటల్లోగా స్పందించకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ బదిలీ వ్యవహారంపై ఇప్పటికే ఆప్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరిస్తోందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై వచ్చేవారం వాదనలు వినేందుకు ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News