Monday, December 23, 2024

అమరజవాన్ల కుటుంబాలకు ఢిల్లీ సర్కార్ రూ. 1 కోటి పరిహారం

- Advertisement -
- Advertisement -

గత తొమ్మిదేళ్లలో దేశం కోసం ప్రాణాలర్పించిన 35 మంది అమరవీరుల కుటుంబాలకు, కరోనా మహమ్మారి కాలంలో ప్రజలకు సేవలందచేసే క్రమంలో వైరస్‌బారిన పడి మరణించిన 92 మంది కొవిడ్ వారియర్ల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారాన్ని ఢిల్లీ ప్రభుత్వం అందచేసింది. ఈ విషయాన్ని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి సోమవారం రాష్ట్ర బడ్జెట్ సమర్పణ సందర్భంగా అసెంబ్లీలో వెల్లడించారు. అమరవీరుల త్యాగాలను, వారి సేవలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అమరవీరుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించిన దేశంలోని ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు.

కరోనా మహమ్మారి కాలంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన 92 మంది కొవిడ్ వారియర్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయంతోపాటు, రూ. 1 కోటి చొప్పున నష్టపరిహారం అందించామని ఆమె తెలిపారు. దేశ రాజధానిలో కొత్తగా నాలుగు కోర్టు పముదాయాలను ఢిల్లీ ప్రభుత్వం నిర్మించనున్నదని, ఇందుకోసం ఈ బడ్జెట్‌లో రూ. 3,098 కోట్లను కేటాయించామని అతిషి చెప్పారు. రోషిణి, కర్కర్‌దూమ, శాస్త్రి పార్కు, రూస్ అవెన్యూలో కొత్త కోర్టు సముదాయాలను నిర్మించనున్నట్లు ఆమె తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News