Saturday, November 23, 2024

ఆటో డ్రైవర్లకు రూ.5000 ఆర్థిక సహాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలోని పేదలకు రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ సరుకులు అందజేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో, ఢిల్లీలోని మొత్తం 72 లక్షల రేషన్‌కార్డుదారుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని ఆయన తెలిపారు. ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు కూడా రూ.5000 చొప్పున ఆర్థిక సహాయాన్ని కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కారణంగా గతేడాది మొదటిసారి లాక్‌డౌన్ విధించినపుడు కూడా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రూ.5000 సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఢిల్లీలో దాదాపు లక్షా 56 వేలమంది డ్రైవర్లున్నారు. నిర్మాణ కార్మికులకు రూ.5000 చొప్పున ఆర్థిక సహాయాన్ని గత వారమే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో లాక్‌డౌన్‌ను రెండు నెలలపాటు కొనసాగిస్తామని అర్థం చేసుకోవద్దని ఆయన సూచించారు. పరిస్థితులు త్వరలోనే మెరుగుపడి లాక్‌డౌన్‌ను తొలగించుకోగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండగా ఈ నెల 10 వరకు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

Delhi Govt to give rs 5000 for Auto Drivers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News