Monday, January 13, 2025

మహిళలకు ప్రతినెలా రూ. 2100 ఆర్థిక సాయం

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా తాము మళ్లీ అధికారం లోకి వస్తే మహిళలకు ప్రతినెలా రూ. 2100 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘ నేను ప్రతి మహిళకు రూ. 1000 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈ ప్రతిపాదనకు గురువారం ఉదయం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 1015 రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ డబ్బు అభ్యర్థుల ఖాతాల్లో బదిలీ చేయడం సాధ్యం కాదు.

మరోవైపు ద్రవ్యోల్బణం కారణంగా ఆ మొత్తం చాలదని పలువురు మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే నెలకు రూ.2100 ఇవ్వాలని నిర్ణయించాం. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన దరఖాస్తులు శుక్రవారం నుంచి స్వీకరిస్తాం ” అని కేజ్రీవాల్ తెలిపారు. ఇటీవల ఢిల్లీ ఆటోడ్రైవర్లకు రూ. 10 లక్షల వరకు లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతోపాటు రూ. 5 లక్షల వరకు ప్రమాద బీమా అందిస్తామని, వారి కుమార్తెల పెళ్ళిళ్లకు రూ. లక్ష ఆర్థికసాయం , ఆటోవాలాలకు యూనిఫాం అలవెన్స్ కింద ఏడాదికి రెండుసార్లు రూ. 2500 వంతున ఇస్తామని హామీల వర్షం కురిపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News